: మా ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం: పల్లె
ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమది పనిచేసే ప్రభుత్వమని ఉద్ఘాటించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కేంద్రం సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. రుణమాఫీ అంశంలో రైతులు ఆందళన చెందాల్సిన అవసరంలేదని చెప్పారు. మూడు విడతల్లో రుణ మాఫీ చేస్తామని తెలిపారు.