: సేవ చేయండి... కేసు కొట్టేస్తాం: ముంబై కోర్టు


దూకుడుగా వ్యవహరించిన నలుగురు యువకులు ఓ యువకుడిపై దాడికి దిగారు. కేసులో ఇరుక్కున్నారు. తదనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. బాధిత యువకుడితో రాజీ కూడా పడ్డారు. మేం రాజీ పడ్డాం, కేసు కొట్టేయండంటూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. దూకుడుగా వ్యవహరించే యువతలో మార్పు తెచ్చేందుకు ఇదే సరైన సమయమని భావించిన కోర్టు, ఆ యువకులకు ఓ కండిషన్ పెట్టింది. తమ కండిషన్ కు అంగీకరిస్తేనే కేసు కొట్టేస్తామని వెల్లడించింది. ఇంతకూ ఆ యువకులకు కోర్టు పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా? సామాజిక సేవ! అవును, సామాజిక సేవ చేయడం ద్వారా యువత సన్మార్గంలో నడుస్తుందని భావించిన జస్టిస్ కనాడే, జస్టిస్ కోడేలతో కూడిన ధర్మాసనం ఈ సరికొత్త కండిషన్ ను పెట్టింది. సామాజిక సేవలో భాగంగా... నాలుగు వారాంతాల్లో ఆర్థర్ రోడ్డులోని కేంద్ర కారాగారంలో ఓ జూనియర్ న్యాయవాది సహాయంతో ఖైదీల తరఫున వారి కేసుల్లో విన్నపాలు రాయాలట. అంతేగాక, టాటా కేన్సర్ పరిశోధన కేంద్రానికి తలా రూ. 2 వేలు విరాళమందించాలని కోర్టు ఆ నలుగురు యువకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు పనులను ముగించిన మరుక్షణమే వారిపై నమోదైన కేసును కొట్టేస్తామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News