: చర్లపల్లి జైల్లో గంజాయి కలకలం


హైదరాబాద్ లోని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఆదివారం తెల్లవారుజామున గంజాయి కలకలం రేగింది. జైలులోని కృష్ణ, బ్రహ్మపుత్ర బ్యారక్ లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలులోని ఖైదీలకు గంజాయి ఏ మార్గంలో చేరిందన్న అంశం కీలకంగా మారింది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో జైలు అధికారులు రంగంలోకి దిగారు. మరోవైపు, శనివారం సాయంత్రం జైలు ఆవరణలోని అగర్ బత్తి తయారీ కేంద్రం సమీపంలో జరిపిన సోదాల్లో భూమి లోపల దాచిన సెల్ ఫోన్లు బయటపడ్డాయి. వీటిలోని ఓ సెల్ లో సిమ్ కార్డును కూడా గుర్తించిన పోలీసులు సదరు మొబైల్ నెంబరు కాల్ డేటాను పరిశీలించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News