: విజయ్ మాల్యాకు ఉపశమనం


తనను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) 'ఉద్దేశపూర్వక ఎగవేతదారు'గా ప్రకటించడం పట్ల విజయ్ మాల్యా కోల్ కతా హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. బ్యాంకు రిడ్రెసల్ కమిటీ ఇచ్చిన తీర్పుపై న్యాయస్థానం స్టే ఇచ్చిందని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ మిర్ పురి తెలిపారు. కాగా, ఈ వ్యవహారంలో నవంబర్ 3 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు బ్యాంకును ఆదేశించింది. ఆ తర్వాత వారం రోజుల్లోపు బ్యాంకు అఫిడవిట్ పై జవాబివ్వాలని కోర్టు పిటిషనర్లకు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News