: రాగి ముద్ద, సాంబారు, ఆవకాయతో పెరుగన్నం: జైల్లో జయ తొలి భోజనం


నిన్నటిదాకా రాజభోగాలు అనుభవించిన జయలలిత శనివారం రాత్రి బెంగళూరు సెంట్రల్ జైలులో సాధారణ ఖైదీల మాదిరే సాదాసీదా భోజనం చేయాల్సి వచ్చింది. శనివారం సాయంత్రం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయలలితకు శిక్ష ఖరారు చేయగానే పోలీసులు ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. రాత్రి కాగానే జైలులోని ఖైదీలకు అందించే భోజనాన్ని ఆమెకు కూడా అందజేశారు. ఈ భోజనంలో రాగిముద్ద, సాంబారు తో పాటు పెరుగన్నం కూడా ఉందని జైలు సిబ్బంది వెల్లడించారు. పెరుగన్నాన్ని ఆవకాయ పచ్చడితో కలుపుకుని జయలలిత ఆరగించారట.

  • Loading...

More Telugu News