: ఐరాస, భద్రతామండలిలో మార్పులు అనివార్యం: మోడీ


ఐరాస, భద్రతామండలిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని... అది అనివార్యం అని ప్రధాని మోడీ కుండబద్దలు కొట్టారు. భద్రతామండలిని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమయిందని చెప్పారు. సభ్యదేశాలన్నీ అంతర్జాతీయ నియమాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రపంచ భవితను ఏ ఒక్క దేశామో మార్చలేదని అన్నారు. ప్రతి దేశం తమ బాధ్యతలను నెరవేర్చాలని చెప్పారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచీకరణ జరుగుతున్న ఈ యుగంలోనూ ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని... కోట్లాది మంది నేటికీ పారిశుద్ధ్యానికి దూరంగా ఉన్నారని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై మనందరి లక్షం ఒకటేనని చెప్పుకుంటూనే... లాభనష్టాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళుతున్నామని అన్నారు. ఇలాంటి విధానాలు మన భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తాయని తెలిపారు. ఆర్థిక అభివృద్ధితో పాటు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడానికి సభ్యదేశాలు కట్టుబడి ఉండాలని సూచించారు. భారత్ తన టెక్నాలజీని ఇతర దేశాలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.

  • Loading...

More Telugu News