: మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన?
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై దృష్టి సారించింది. కాసేపట్లో ప్రారంభం కానున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపుపై చర్చించనున్నారు. అక్టోబర్ 15న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కొద్ది రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధింపునకే కేంద్ర కేబినెట్ మొగ్గు చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.