: మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామాను ఆమోదించిన గవర్నర్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగర్ రావు ఆమోదించారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంతవరకు పదవిలో కొనసాగాలని కోరినట్టు సమాచారం. కాంగ్రెస్ తో గత 15 ఏళ్లుగా ఉన్న బంధానికి ఎన్సీపీ ముగింపు పలకడంతో మహారాష్ట్రలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడింది. 288 మంది సభ్యులు గల అసెంబ్లీలో ఎన్సీపీ బలం 62. ఎన్సీపీ మద్దతు కోల్పోవడంతో కాంగ్రెస్ బలం 82కు పడిపోయి ప్రభుత్వం మైనారిటీలోకి జారుకుంది. దీంతో, చవాన్ నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అక్టోబర్ 15వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.