: ఎ.రాజా ఆఫీసుపై దాడి చేసిన అన్నాడీఎంకే శ్రేణులు
డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా కార్యాలయంపై అన్నా డీఎంకే కార్యకర్తలు దాడి చేశారు. తమ అధినేత్రి జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శిక్ష విధించిన తర్వాత వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. దీంతో, పెరంబలూరులోని రాజా కార్యాలయం పాక్షికంగా ధ్వంసమయింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మరింత విధ్వంసం జరగకుండా అడ్డుకున్నారు.