: భారత జాలర్లను అరెస్టు చేసిన పాక్
దాదాపు 29 మంది భారత జాలర్లను పాకిస్థాన్ మారిటైం సెక్యూరిటీ ఏజెన్సీ (ఎంఎస్ఏ) అధికారులు అరెస్టు చేశారు. జాలర్లకు చెందిన ఐదు బోట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. తమ దేశ సముద్ర జలాల్లో పది కిలోమీటర్ల లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించారంటూ ఆరోపించిన పాక్ వారిని అదుపులోకి తీసుకుంది. ఇలా భారత జాలర్లను పాక్ నిర్బంధించడం ఇది తొలిసారేమి కాదు.