: జయ కథ ముగిసింది: సుబ్రహ్మణ్యస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అక్రమాస్తుల కేసులో కోర్టు దోషిగా తేల్చడంతో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆనందంలో మునిగితేలుతున్నారు. జయకు బద్ధ విరోధి అయిన సుబ్రహ్మణ్యస్వామి ఆమెపై 1996 జూన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు జయ అక్రమాస్తులపై విచారణ జరపాలని ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో జయకు శిక్ష పడనుండటంతో సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇక జయ కథ ముగిసినట్టేనని ఆయన తెలిపారు. అంతేకాకుండా, JJ = Jail for Jayalalita అంటూ ట్వీట్ చేశారు.