: శాసనసభను రద్దు చేయాలని కోరం: డీఎంకే
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలుకు వెళుతున్న నేపథ్యంలో, తమిళనాడులో రాజకీయ పరంగా పలు మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్యంత వేగంగా మారుతున్న పరిణామాలను డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. పార్టీ అధినేత కరుణానిధి నివాసంలో స్టాలిన్ తో పాటు పలువురు పార్టీ కీలక నేతలు మంతనాలు సాగిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. జయను కోర్టు దోషిగా తేల్చిన అనంతరం డీఎంకే స్పందించింది. తీర్పు రావడం లేటయినా న్యాయం జరిగిందని తెలిపింది. ముఖ్యమంత్రికి శిక్ష పడిన నేపథ్యంలో, రాజకీయ అస్థిరతను అవకాశంగా తీసుకుని... శాసనసభను రద్దు చేయాలని కోరమని స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలనను కూడా కోరమని వెల్లడించింది.