: జయలలితపై అనర్హత వేటు?
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చింది. కాసేపట్లో శిక్షను కూడా ఖరారు చేయనుంది. వాదనల సందర్భంగా... కేసులో దోషిగా తేలిన జయకు ఏడేళ్ల జైలు శిక్ష విధించాలని ప్రత్యేక ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. అయితే, జయకు రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ, రెండేళ్లకు మించి శిక్ష పడితే అమెపై అనర్హత వేటు పడుతుంది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడమే కాక, ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో, తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.