: కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన షరీఫ్ కు హఫీజ్ సయీద్ ప్రశంస
ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (యూఎన్ జీఏ)లో కీలకమైన కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ను జమాతే-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రశంసించాడు. సమావేశంలో ప్రసంగించిన షరీఫ్, కీలకమైన కాశ్మీర్ అంశం మీద 'ముసుగు' కప్పలేరని నొక్కిచెప్పారు. ఈ మాటలపై స్పందించిన సయిీద్, పాక్ పీఎం ప్రకటన మెచ్చుకోదగినదిగా ఉందని పేర్కొన్నాడు. "కాశ్మీర్ అంశంపై యూఎన్ జీఏలో షరీఫ్ ముక్కుసూటిగా చేసిన ప్రకటనను అభినందిస్తున్నాము. ఇది జాతి ఆకాంక్షలను యథాతథంగా సూచిస్తుంది" అని జమాతే-ఉద్-దవా చీఫ్ ట్విట్టర్ లో తెలిపాడు.