: కరుణానిధి, సుబ్రహ్మణ్యస్వామి నివాసాల వద్ద తీవ్ర ఉద్రిక్తత
కాసేపట్లో అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో, చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నగరంలో పాక్షికంగా బంద్ వాతావరణం నెలకొంది. వాణిజ్య సముదాయాలు, షాపులు మూతపడుతున్నాయి. డీఎంకే అధినేత కరుణానిధి, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి నివాసాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కరుణానిధి నివాసాన్ని ముట్టడించేందుకు ఏఐఏడీఎంకే కార్యకర్తలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు, సుబ్రహ్మణ్యస్వామి నివాసంపై ఏఐఏడీఎంకే కార్యకర్తలు రాళ్లు రువ్వారు. అలాగే, డీఎంకే శ్రేణులపై కూడా జయ మద్దతుదారులు రాళ్లు విసిరారు.