: చంద్రబాబు మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణలకు 'నో'... విచారణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, టీవీ ఛానెళ్ల విలేకరులను అనుమతించడం లేదు. దాంతో, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు అందింది. దానిని పరిశీలించిన పీసీఐ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జు విచారణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయంపై సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ రంజన్ నాగ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ అంశంపై నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన తరువాతనే విచారణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.