: డీఎంకే కార్యాలయం, నేతల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కోర్టు దోషిగా ప్రకటించడంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అధికారులు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, డీఎంకే కార్యాలయంతో పాటు ఆ పార్టీ నేతలందరి ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనికితోడు, వార్తా చానెళ్లను కూడా ఆపివేశారు. జయకు కాసేపట్లో శిక్ష ఖరారు కానుంది.