: జమ్మూ కాశ్మీర్ కు 'మాతా అమృతానందమయి మఠ్' భారీ సాయం
జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు కేరళలోని కొల్లామ్ కు చెందిన 'మాతా అమృతానందమయి మఠ్' భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. బాధితులకు పునరావాసం కింద రూ.25 కోట్లు ఇవ్వనున్నట్లు మఠ్ అధినేత మాతా అమృతానందమయి తన 61వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా తెలిపారు. ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.