: ఎస్పీతో ఒకరోజులో కాంగ్రెస్ జట్టు... మర్నాడే రద్దు!


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీతో పదిహేనేళ్ల మిత్ర బంధాన్ని కాంగ్రెస్ తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆ రాష్ట్ర సమాజ్ వాదీ పార్టీతో జట్టుకట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట రాష్ట్ర నేతలతో చర్చలు జరిపి ఎనిమిది సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకుంది. కానీ తరువాతి రోజు అర్ధరాత్రి ఆ రాష్ట్ర ఎస్పీ అధినేత అబు అసిమ్ అజ్మీకి సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు ఫోన్ చేశారు. తమ పార్టీ ఢిల్లీ నేతలు ఈ ఒప్పందానికి అంగీకరించడం లేదని, అందుకే పొత్తును విరమించుకుంటున్నామని చెప్పి షాక్ ఇచ్చారు. దాంతో, ఎస్పీ నేతలు కాంగ్రెస్ పై మండిపడుతున్నారు.

  • Loading...

More Telugu News