: వామ్మో! అది ఐ ఫోన్ కాదు బాబోయ్... స్పై ఫోన్!


యాపిల్ కంపెనీ లేటెస్ట్ ఇన్వెన్షన్ ఐఫోన్-6, ఐఫోన్-6ప్లస్ మీరు వినియోగిస్తున్నారా? అయితే మీరు ఇబ్బందుల్లో పడ్డట్టే! ఎందుకంటే, మీకు తెలియకుండానే మీ గురించి ఐఫోన్ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తోంది. మనకు తెలియకుండా ఐఫోన్ మన సమాచారం ఎలా తీసుకుంటుందనుకుంటున్నారా? అయితే ఇది చదవండి... 'ఫ్రీక్వెంట్ లొకేషన్స్' అనే ఫీచర్ ఒకటి ఐఫోన్ లో ఉందన్న విషయం మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి... ఈ ఆప్షన్ ను గత వెర్షన్ నుంచే యాపిల్ అప్ లోడ్ చేసింది. ఇది చేసే పని ఏంటంటే మీ మీద గూఢచర్యం (స్పై) చేయడమే! నిపుణులు ఇది ఎవరికీ చిక్కకుండా ఐదు లేయర్ల కింద కప్పిపెట్టేశారు. కేవలం మ్యాపింగ్ సర్వీసులను మెరుగుపరచడానికే ఈ అప్లికేషన్ ను అప్ లోడ్ చేసినట్టు యాపిల్ కంపెనీ చెబుతున్నప్పటికీ, దీంతో వ్యక్తిగత జీవితానికి చాలా ప్రమాదాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్ కంప్యూటర్ నిపుణుడు ప్రొఫెసర్ నోయెల్ షార్కీ మాటల్లో అయితే ఇది చాలా భయంకరమైన షాకింగ్ న్యూస్. నిపుణులు అలాగే చెబుతారు... మనకి తెలియకుండా రికార్డింగ్ ఎలా జరుగుతుందని నిర్లక్ష్యం చేశారో మీ పని అంతే. మీరు ఎక్కడెక్కడ, ఎవరెవరిని కలుస్తారు, ఏయే సమయాల్లో ప్రయాణాలు చేస్తారు, ఎక్కడ షాపింగ్ చేస్తారు, ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు... వంటి విషయాలన్నీ రికార్డు అయిపోతాయని చెబుతున్నారు. ఈ ఆప్షన్ కారణంగా విడాకులు సులభమవుతాయని నిపుణులు తెలిపారు. వీఐపీలకు దీని వల్ల ప్రాణహాని సంభవించినా పెద్ద అశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News