: జయలలిత దోషే: ప్రత్యేక కోర్టు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తులు కూడబెట్టారని ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత దోషేనని స్పష్టం చేసింది. కేవలం ఒక రూపాయి మాత్రమే వేతనంగా స్వీకరిస్తూ జయలలిత అంత పెద్ద స్థాయిలో ఆస్తులు ఎలా కూడబెట్టారని న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 1996లో ఆమె అక్రమాస్తుల కేసులో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. అనంతరం ఆమె రెండు నెలల జైలు శిక్ష కూడా అనుభవించారు. 18 ఏళ్ల సుదీర్ఘ విచారణ సాగిన ఈ కేసులో న్యాయస్థానం చివరికి జయలలితను దోషిగా నిర్థారించింది. జయలలిత ఆస్తులను 66 కోట్లుగా న్యాయస్థానం లెక్క కట్టింది. అయితే శిక్షను మధ్యాహ్నం న్యాయస్థానం ఖరారు చేయనుందని సమాచారం.