: జమ్మూ కాశ్మీర్ బాధితులకు సల్మాన్ ఆర్థిక సాయం


జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు పలువురి నుంచి ఆర్థిక సాయం వెల్లువెత్తుతోంది. తాజాగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనవంతుగా రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ రాష్ట్ర సహాయ నిధికి ఆ మొత్తాన్ని అందించారు. ఇలాంటి విషయాల్లో సల్లూ తన బాద్యతగా పలు సంస్థలకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. అంతేగాక, ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న 'బీయింగ్ హ్యూమన్' అనే స్వచ్ఛంధ సంస్థ ద్వారా అనేక సమయాల్లో పలువురికి మద్దతుగా నిలుస్తున్నారు.

  • Loading...

More Telugu News