: రేపిస్టుకు 106 ఏళ్ల జైలు శిక్ష... అతిపెద్ద శిక్ష ఇదే!


బ్రెజిల్ లోని క్వైడామాలో శాంటాస్ పెరీరా అనే వ్యక్తి 2012లో పుట్టిన రోజు నాడు ఘనంగా పార్టీ ఇచ్చాడు. పార్టీకి పలువురిని ఆహ్వానించాడు. అందులో ఓ ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే వారిని పథకం ప్రకారం పిలిచినట్టు వారికి తెలియదు. దీంతో పెరీరా తన ఏడుగురు మిత్రులతో కలిసి పధకం అమలు చేశాడు. ఆ ఐదుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిలో ఇసబెల్లా ప్రజావో మాంటీరో (27), మిషెల్ డొమింగ్యూస్ డ సిల్వా (29) అనే మహిళలను హతమార్చారు. వారిలో బతికి బట్టకట్టిన అత్యాచార బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ హత్యలు వెలుగుచూశాయి. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి సాక్ష్యాధారాలతో దోషులను న్యాయస్థానం ముందు నిలబెట్టారు. తుది విచారణ సందర్భంగా 19 గంటలపాటు నిందితులను విచారించిన న్యాయమూర్తి ప్రధాన నిందితుడు పెరీరాకు 106 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అతనితో పాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఆరుగురికి 26 నుంచి 44 ఏళ్ల జైలు శిక్ష విధించారు. దీంతో రేపిస్టు హంతకులకు సరైన శిక్షేపడిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News