: విజయవాడ దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ప్రారంభం
విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసిన దూరదర్శన్ సప్తగిరి ఛానల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. అటు ఆల్ ఇండియా రేడియోలో పింగళి వెంకయ్య పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎంకి, కేంద్రమంత్రికి దూరదర్శన్ అధికారులు జ్ఞాపికలు అందజేశారు. పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఈ మధ్యాహ్నం చంద్రబాబు బెజవాడ దుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు.