: నలుగురు మృగాళ్ళు ఇనుపరాడ్లతో మహిళను చావబాదారు
తీసుకున్న 20వేలు తిరిగి ఇవ్వమని అడిగింది. అంతే... ఆమెను ఒక రాక్షసిగా భావించి ఇనుపరాడ్లతో దాడి చేశారు దుండగులు. పంజాబ్ లోని లుథియానాలో ఈ ఘటన జరిగింది. మహిళ ప్రాధేయపడుతున్నా.. కనికరించడకుండా రాడ్లు తీసుకుని నలుగురు మగాళ్లు చుట్టూ మూగి దారుణంగా కొట్టారు. పెద్దగా కేకలు వేస్తూ ఆ మహిళ ప్రాణ భయంతో పరుగులు తీసింది. స్థానికులు, చుట్టుపక్కల వారు సినిమాలా చూశారేగానీ ఒక్కరూ దాడిని అడ్డుకోలేదు. పంజాబ్ లో ఇలాంటి దారుణాలు అడపాదడపా జరుగుతూనే ఉంటాయి. అయినా అక్కడ పోలీసులకు అందే ఫిర్యాదులు తక్కువే. ఎందుకంటే కంప్లయింట్ చేస్తే, చేసిన వాళ్ళని పోలీసులూ చావబాదుతారు మరి!