: తిరుమలలో భక్తులపై విజిలెన్స్ అధికారులు దౌర్జన్యం... ఆందోళన


తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ పెరిగింది. తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున సేవా బృందాలు తిరుమలకు చేరుకోవడంతో రద్దీ మరింత పెరిగింది. భక్తులు బస చేసేందుకు వసతి లేకపోవడంతో తిరుమాడ వీధుల్లో భక్తులు తీష్ట వేశారు. దీంతో విజిలెన్స్ అధికారులు సేవా బృందాలను బలవంతంగా పంపేందుకు ప్రయత్నించారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవా బృందాలను టీటీడీ చిన్నచూపుచూస్తోందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఆందోళనను భక్తులు ఇంకా విరమించలేదు.

  • Loading...

More Telugu News