: ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఎస్సై మృతి


శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు బిట్రగుంట. జె.పంగులూరు మండలం ముప్పవరానికి చెందిన ఎస్సై విష్ణుగోపాల్ ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతి చెందారు. 2012 ఎస్సై బ్యాచ్‌కు చెందిన విష్ణుగోపాల్ ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన విధినిర్వహణలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉండగానే ప్రమాద వశాత్తు తుపాకీ పేలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సహచరులు ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా ఆయన మృతి చెందారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News