: జ్వరం, జలుబుకు యాంటీబయాటిక్స్ ను రాయొద్దు: వైద్యులను ఆదేశించనున్న ఐఎంఏ


దేశంలో యాంటిబయాటిక్స్ ఔషధాల వల్ల జరుగుతున్న నష్టాలను నివారించేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రంగంలోకి దిగింది. జ్వరం, జలుబు తరహా సమస్యలకు యాంటిబయాటిక్స్ ను సూచించడాన్ని మానుకోవాలని వైద్యులకు సూచించనుంది. వైరల్ ఇన్ ఫెక్షన్ల వల్ల సోకే చిన్నపాటి సమస్యలకే యాంటిబయాటిక్స్ మందులను సూచించడం అనవసర ఇబ్బందులకు తావిస్తోందని భావిస్తున్న ఐఎంఏ, ఈ మేరకు వైద్యులకు ఆదేశాలు జారీ చేయాలని యోచిస్తోంది. యాంటిబయాటిక్స్ అధిక వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలపై ఐఎంఏ ఆదివారం దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాన్ని చేపట్టనుంది. ‘గడచిన రెండు దశాబ్దాల్లో కొత్త యాంటిబయాటిక్స్ అందుబాటులోకి రాలేదు. దీంతో మనం వాడుతున్న యాంటిబయాటిక్స్ ను అధిగమించే స్థాయికి వ్యాధికారక వైరస్ అభివృద్ధి చెందుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో చిన్నపాటి రోగాలు కూడా ప్రాణాంతక సమస్యలుగా మారే ప్రమాదం లేకపోలేదు’ అంటూ ఐఎంఏ సెక్రటరీ జనరల్ నరేందర్ సైనీ ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News