: దూరదర్శన్ ఘోరమైన తప్పిదం


ప్రభుత్వ టెలివిజన్ దూరదర్శన్ ఘోరమైన తప్పిదాలు చేస్తూ ప్రతిష్ఠ కోల్పోతోంది. ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన సందర్బంగా వార్తలు చదివిన న్యూస్ రీడర్ ఆయన పేరులోని ‘ఎక్స్‌ఐ’(ఝ) అక్షరాలను రోమన్ అంకెల్లోని 11గా భావించి, ‘ఎలెవన్’గా పలికి సస్పెండైన ఘటన మరచిపోకముందే మరో ఘోర తప్పిదం చేసింది. ఈసారి తప్పు వీడియో ఎడిటర్, ఎంసీఆర్, పీసీఆర్ లది. ఎందుకంటే, దూరదర్శన్ దృష్టిలో భారత ప్రధాని ఇంకా మన్మోహన్ సింగే. ప్రధాని అంటూ వార్తలు చదివిన ప్రతిసారి మన్మోహన్ సింగ్ వీడియోలనే చూపిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన వార్తలను ప్రసారం చేసిన దూరద్శన్ మోడీని చూపించాల్సిన స్థానంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ను ప్రసారం చేసింది. ఈ తప్పు ఒక్కసారితో ముగియకుండా పలు బులెటిన్లలో పునరావృతమైందని దూరదర్శన్ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News