: నవాజ్ షరీఫ్ ముసుగు తీసేశారు...రెచ్చగొట్టారు


పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తన ముసుగు తీసేశారు. ఉదారవాదిగా, భారత్ తో స్నేహహస్తం చాచడంలో ముందుంటారని పేరున్న నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితిలో తన అసలు స్వరూపం ప్రదర్శించారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత్ పై తన అక్కసునంతా వెళ్లగక్కారు. ఐక్యరాజ్యసమితిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని పలు దేశాలు సలహా ఇస్తున్న నేపథ్యంలో కొత్త దేశాలకు ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం కల్పించరాదని తెగేసి చెప్పారు. కాశ్మీరీలు భారత్ దురాక్రమణలో ఉన్నారని నవాజ్ షరీఫ్ చెప్పారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం పాకిస్థాన్ కు చాలా కీలకమైనదని ఆయన స్పష్టం చేశారు. కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తెలియాలంటే ప్లెబిసైట్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత్ వైఖరి కారణంగానే భారత్ తో జరగాల్సిన సమావేశం జరగలేదని విమర్శించిన ఆయన, మరోసారి సమావేశం కావాలంటే భారతే చొరవ తీసుకోవాలని తెలిపారు. నవాజ్ షరీఫ్ తీరును రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ లో నవాజ్ ప్రభుత్వానికి ఎదురవుతున్న వ్యతిరేకతను అడ్డుకోవాలంటే తాను భారత్ వ్యతిరేకిననిపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. కాశ్మీర్ లో ఒక్క అంగుళం కూడా వదులుకోమని బిలావల్ ప్రతిన బూనటంతో, వారికి ప్రాధాన్యత లేకుండా చేయాలంటే భారత్ పై విరుచుకుపడటమే మార్గమని షరీఫ్ భావిస్తున్నారు. అయితే, టిట్ ఫర్ టాట్ ఇవ్వడంలో సిద్ధహస్తుడనిపించుకునే భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, నవాజ్ వ్యాఖ్యలకు ఘాటైన సమాధానం ఇవ్వకుండా ఉంటారా?

  • Loading...

More Telugu News