: చెన్నై సెంట్రల్ లో వైఫై సౌకర్యం!
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్, దేశంలోనే వైఫై సౌకర్యం కలిగిన తొలి రైల్వే స్టేషన్ గా అవతరించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ శుక్రవారం ఈ రైల్వే స్టేషన్ లో వైఫై సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాక తన మొబైల్ లో వైఫై సౌకర్యాన్ని ఆయన పరిశీలించారు. ఇకపై చెన్నై రైల్వే స్టేషన్ కు వచ్చే వారెవరైనా అరగంట పాటు తమ ల్యాప్ టాప్, మొబైళ్లలో ఉచితంగానే ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాుటులోకి వచ్చేందుకు మరిన్ని రోజుల సమయం పట్టే అవకాశముంది. ఉచిత ఇంటర్నెట్ సౌలభ్యంలో భాగంగా డౌన్ లోడింగ్ పై ఎలాంటి పరిమితి లేనప్పటికీ, అప్ లోడింగ్ పై మాత్రం ప్రయాణికులకు అనుమతి లేదు. ఇక 30 నిమిషాల పాటు ఉచితంగానే ఇంటర్నెట్ ను వాడుకునే ప్రయాణికులు మరింత సమయం నెట్ లో కొనసాగాలంటే, తమ అకౌంట్ల ద్వారా రీచార్జీ చేసుకోవాల్సి ఉంటుంది.