: భారత్ రేటింగ్ పెరిగింది!


ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నేపథ్యంలో భారత్ రేటింగ్ ను పెంచుతూ స్టాండర్డ్ అండ్ పూర్ (ఎస్ అండ్ పీ) తీర్మానించింది. ఎస్ అండ్ పీ రేటింగ్స్ లో భారత్ నిన్నటిదాకా నెగెటివ్ ర్యాంకింగ్ లో కొనసాగిన సంగతి తెలిసిందే. దేశంలో కొత్తగా అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం, సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధిని నమోదు చేయగలదన్న విశ్వాసం ఉందని ప్రకటించిన ఎస్ అండ్ పీ, భారత రేటింగ్ ను నెగెటివ్ నుంచి స్టేబుల్ (స్థిర)కు పెంచింది. దేశంలో జీబీడీ వృద్ధి రేటు 5.5 కంటే అధికంగా నమోదు కాగలదన్న విశ్వాసంతోనే భారత రేటింగ్ ను ‘బీబీబీ-/ఏ-3’ స్థాయికి పెంచుతున్నామని ఆ సంస్థ శుక్రవారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు ఇప్పటికే రంగంలోకి దిగిందని చెప్పిన ఎస్ అండ్ పూర్, దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు నింపే సత్తా మోడీ సర్కారుకు ఉందన్న విశ్వాసాన్ని ప్రకటించింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని, ఆ దేశ కార్పోరేట్ దిగ్గజాలతో భేటీ కానున్న నేపథ్యంలో ఎస్ అండ్ పీ, భారత్ రేటింగ్ ను పెంచడం గమనార్హం.

  • Loading...

More Telugu News