: కేంద్రానికి నివేదిక సమర్పించిన ఏపీ పోలీస్


కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నివేదిక సమర్పించింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో పోలీసులకు ప్రధాన భవంతి కంట్రోల్ రూం, ఇతర సౌకర్యాలు లేకుండా పోయాయి. పదేళ్ల ఉమ్మడి రాజధాని తరువాత పరిస్థితిపై కేంద్రానికి పోలీసు నివేదిక సమర్పించారు. హైదరాబాదులో లాగానే ఏపీ రాజధానిలోనూ పోలీసు విభాగానికి పూర్తి మౌలిక సదుపాయాలను కేంద్రం కల్పించాలని వారు కోరారు. ఈ నివేదికలో ఏపీలో పోలీసు విభాగానికి హైదరాబాద్‌ పోలీస్ వ్యవస్థలాంటి స్వరూపం వచ్చేందుకు ఇంచుమించు 3 వేల ఎకరాల భూమిలో, కోటి చదరపు అడుగుల నిర్మాణాలు అవసరమని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. భూ కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తే, నిర్మాణాలకు కేంద్రం ఆర్థిక సాయం చేయాలి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం స్థిరచరాస్తులు సహా అన్నింటినీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు 58.32 : 41.68 నిష్పత్తిలో పంచాలి. ఉమ్మడి రాజధానిగా ఉన్న పదేళ్లు హైదరాబాద్‌లో పోలీసు శాఖకు ఉన్న భవనాల్లో కొన్ని ఏపీ అధికారులూ వినియోగించుకోవచ్చు.

  • Loading...

More Telugu News