: కేసీఆర్ అసలు రంగు బయటపడింది: విరసం
విప్లవ ప్రజాతంత్ర వేదిక (ఆర్‌డీఎఫ్), సీపీఐ (మావోయిస్టు) పార్టీతో పాటు అనుబంధ రైతుకూలీ, కార్మిక, విద్యార్థి సంఘాలపై నిషేధం పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తాను కూడా అనుసరిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం తన అసలు రంగును బయపెట్టిందని విప్లవ రచయితల సంఘం (విరసం) ఆరోపించింది. ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోనే తెలంగాణ సర్కారు కూడా విడుదల చేసిందని, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను అడ్డుకొని ప్రజలను భయాందోళనలకు గురిచేసిందని విరసం పేర్కొంది. మీడియాను పాతరేస్తానంటూ హెచ్చరికలు చేసిన కేసీఆర్, తాను తప్ప మరెవరూ మాట్లాడకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారని విరసం మండిపడింది. అన్ని ప్రజాసంఘాల పైన, మావోయిస్టు పార్టీ పైన నిషేధం ఎత్తివేయాలని విరసం డిమాండ్ చేసింది.