: చాంపియన్స్ లీగ్ లో ఉత్కంఠ పోరు... సూపర్ ఓవర్ మ్యాచ్!
ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో ఉత్కంఠభరితమైన మ్యాచ్ మొహాలీలో జరిగింది. పసందైన క్రికెట్ విందును అభిమానులు తనివి తీరా ఆస్వాదించారు. బార్బడోస్ ట్రైడెంట్ జట్టు, కేప్ కోబ్రాస్ జట్లు నువ్వా? నేనా? అనేలా తలపడి క్రికెట్ మజాను అభిమానులకు పంచిపెట్టాయి. టాస్ గెలిచి కేప్ కోబ్రాస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా, బార్బడోస్ ట్రైడెంట్ జట్టు ధాటిగా ఆడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కేప్ కోబ్రాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్ కోబ్రాస్ జట్టు 11 పరుగులు చేయగా, బార్బడోస్ జట్టు 1 వికెట్ చేజార్చుకుంది. దీంతో మరోసారి టెన్షన్ పీక్స్ కు చేరుకుంది. కేప్ కోబ్రాస్ జట్టు అద్భుతంగా బౌలింగ్ చేసి బార్బడోస్ జట్టును కేవలం 10 పరుగులకే కట్టడి చేయండంతో కేప్ కోబ్రాస్ జయకేతనం ఎగురవేసింది.