: సమ్మెకు సిద్ధమవుతున్న 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు


అక్టోబర్ చివరి వారంలో దేశ వ్యాప్త సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు సన్నద్ధమవుతున్నారు. వేతన పెంపులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని బ్యాంకు ఉద్యోగుల సంఘం ఏఐబీఈఏ డిమాండ్ చేస్తోంది. 2012 నవంబర్ నుంచి పదో వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందం అమలు చేస్తే 25 ప్రభుత్వ, 14 ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు ప్రయోజనం పొందనున్నారు. 11 శాతం వేతన పెంపుకు పలు బ్యాంకులు సిద్ధంగా ఉండగా, 25 శాతం పెంచాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్ అసంబద్ధంగా ఉందంటూ బ్యాంకుల యాజమాన్యాలు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News