: కొత్త పొత్తులు, కొత్త ఎత్తులతో రసకందాయంలో మహారాష్ట్ర రాజకీయం


మరాఠా రాజకీయాలు మలుపు తిరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్సీపీ మద్దతు ఉపసంహరించడంతో ముఖ్యమంత్రి పదవికి పృథ్వీరాజ్ చవాన్ రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు మెరుగుపడ్డాయి. మహారాష్ట్రలో ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల దాఖలుకు సమయం అతితక్కువ ఉన్న నేపథ్యంలో, సీఎం చవాన్ నిర్ణయం అందర్నీ గందరగోళంలోకి నెట్టింది. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ జట్టుకట్టనున్నాయన్న వార్తల నేపథ్యంలో, ఆయన రాజీనామాను వ్యూహాత్మక ఎత్తుగడగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమకు పదవీ కాంక్ష లేదని, అందుకే ఎన్సీపీతో దోస్తీని కూడా వదులుకున్నామన్న ప్రచారంతో కాంగ్రెస్ ఎన్నికల్లోకి వెళ్లే అవకాశముందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుందని, అది బీజేపీకి లాభిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొత్త పొత్తులు, కొత్త ఎత్తులతో మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.

  • Loading...

More Telugu News