: పతన్ కుమార్ బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
పాకిస్థాన్ కు సైనిక రహస్యాలు వెల్లడించారన్న ఆరోపణలపై అరెస్టయిన పతన్ కుమార్ కు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా, ఫేస్ బుక్ లో పరిచయమైన యువతికి పతన్ కుమార్ దేశ సైనిక స్థావరాల రహస్యాలను అమ్మేశాడు. ఆర్మీకి సంబంధించిన కీలక సమాచారం ఇవ్వడంతో అతనిని బోయినపల్లిలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.