: ప్రధాని ఊరెళ్తే... రాజ్ నాధ్ సింగే రాజు!


ప్రధాని విదేశీ పర్యటనల్లో ఉంటే దేశంలో జరిగే చర్యలకు ఎవరు బాధ్యులు? నిర్ణయాధికారం ఎవరిది? అనే ప్రశ్నలు పలు సందర్భాల్లో ఉత్పన్నమవుతుంటాయి. దానికి సమాధానంగా కేంద్ర కేబినెట్ కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి వర్గానికి ఇన్ఛార్జీగా రాజ్ నాథ్ సింగ్ వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. గతంలో ప్రధాని జపాన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా రాజ్ నాధ్ సింగే ఈ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ, అధికారికంగా వెల్లడించలేదు. ఇప్పుడు ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడే ఇలా ప్రకటించారు.

  • Loading...

More Telugu News