: ప్రజలంతా 'స్వచ్ఛ్ భారత్'లో భాగస్వాములు కండి: వెంకయ్యనాయుడు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. గాంధీ జయంతి రోజున ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంతో, రానున్న ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్ర భారత్ గా మారుస్తామని అన్నారు. పారిశుద్ధ్య భారత్ కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. 'స్వచ్ఛ్ భారత్' కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకుని మీడియా విస్తృత ప్రచారం కల్పించి, ప్రజలను చైతన్యవంతులను చేయాలని ఆయన సూచించారు.