: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న డీజీపీ
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. టీఆర్ఎస్ పార్టీ తాను అధికారంలోకి రాకముందు నుంచీ ఈ ఉత్సవాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహిస్తూ, తెలంగాణ ఆచారాలను వ్యాప్తిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో, నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోనూ బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో డీజీపీ అనురాగ్ శర్మ, పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటు, సచివాలయంలోనూ ఈ వేడుకలు నిర్వహించగా, ఆ వేడుకల్లో మంత్రి హరీశ్ రావు సతీమణి పాల్గొన్నారు.