: పాత్రికేయుల పీక కోసిన మిలిటెంట్ ను గుర్తించిన ఎఫ్ బీఐ
అమెరికా పాత్రికేయులు జేమ్స్ ఫోలీ, స్టీవెన్ సాట్లాఫ్ లను అత్యంత భయానక రీతిలో పీకలు తెగ్గోసి చంపేసిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) గుర్తించింది. అయితే, అతని పేరు, జాతీయత, తదితర వివరాలు వెల్లడించేందుకు ఎఫ్ బీఐ డైరక్టర్ జేమ్స్ కామీ నిరాకరించారు. కాగా, వీడియోలో ఆ మిలిటెంట్ మాట్లాడిన ఇంగ్లిష్ యాసను బట్టి అతను లండన్ కు చెందిన వాడని, ముఖ్యంగా, ఆసియా వలసదారులకు చెందిన వ్యక్తి అయి ఉంటాడని ఓ ఐరోపా దేశానికి చెందిన ప్రభుత్వ ప్రముఖుడు చెప్పారు. దీనిపై, ఎఫ్ బీఐ డైరక్టర్ కామీ మీడియాతో మాట్లాడుతూ, "మేమతన్ని గుర్తించామని విశ్వసిస్తున్నాం. కానీ, వివరాలు ఇప్పుడు చెప్పబోవడంలేదు" అని పేర్కొన్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే అమెరికా జర్నలిస్టులు ఫోలీ, సాట్లాఫ్ లను ఐఎస్ఐఎస్ బలిగొన్నది.