: ఈసారి అందమైన ఫొటో పంపిన 'మామ్'
మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్) నేడు మరో ఫొటో పంపింది. అరుణగ్రహం తాలూకు ఒంపును 'మామ్' తన కెమెరాతో క్లిక్ మనిపించింది. ఈ అందమైన ఫొటోను ఇస్రో వర్గాలు 'మామ్ ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశాయి. ఆ ఫొటోతో పాటుగా 'ఏ షాట్ ఆఫ్ మార్షియన్ అట్మాస్ఫియర్. అయాం గెట్టింగ్ బెటర్ ఎట్ ఇట్. నో ప్రెషర్' అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. కాగా, గురువారం నాడు మామ్ తొలి ఫొటోను భూమికి పంపిన సంగతి తెలిసిందే.