: చీపురు పట్టిన కేంద్ర మంత్రి
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చీపురు పట్టారు. 'క్లీన్ ఇండియా' కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని శాస్త్రి భవన్ వద్ద ఆయన చీపురుతో ఊడ్చారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ, 'క్లీన్ ఇండియా' పేరుకు సింబాలిక్ గా ఉంటుందన్న ఉద్దేశంతో తాను చీపురు పట్టలేదని అన్నారు. స్వచ్ఛమైన భారత్ కోసం ఇదో ఉద్యమమని అభివర్ణించారు. ఓ మంత్రితోపాటు అధికారులు కూడా చీపురు పట్టడం అనేది మంచి సందేశమని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను కేంద్రం గురువారం విడుదల చేసింది.