: యాపిల్ ఐఫోన్ 6 వంగిపోతోందట!


యాపిల్ ఐఫోన్ 6 విడుదలైన వారానికే దానిపై ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా కాలం తరువాత యాపిల్ సంస్థ నుంచి వచ్చిన తాజా వెర్షన్ ఫోన్ ను టైటానియం, స్టెయిన్ లెస్ స్టీలో తో అత్యంత నాజూగ్గా తయారు చేశారు. అయితే, నాజూకుదనం నాణ్యతపై ప్రభావం చూపించింది. దీంతో, యాపిల్ ఐ ఫోన్ 6 కొన్న పలువురు వినియోగదారుల నుంచి ఫోన్ వంగిపోతోందంటూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యాపిల్ షేర్లు మూడు శాతం పడిపోయాయి. వెంటనే యాపిల్ సంస్థ నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఫిర్యాదులపై యాపిల్ సంస్థ స్పందిస్తూ... ఐఫోన్ 6 ను స్టెయిన్ లెస్ స్టీల్ తోనూ, ఐఫోన్ 6 ప్లస్ ను టైటానియంతోనూ తయారు చేశామని వెల్లడించింది. నాణ్యమైన లోహంతో ఫోన్ ను తయారు చేసినప్పటికీ... వినియోగదారులు ధరించిన ప్యాంట్లు పలుచగాను, టైట్ గాను ఉంటే... జేబులో పెట్టుకున్నప్పుడు నాజూగ్గా ఉన్న ఫోన్ వంగిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ సేపు ప్యాంటు వెనుక జేబులో పెట్టుకుంటే ఫోన్ అలెర్ట్ చేస్తుందని, అయినా పట్టించుకోని పక్షంలో ఫోన్ లో సమస్యలు తలెత్తుతాయని సంస్థ వివరించింది. వినియోగదారులకు అసౌకర్యం కలిగించినందుకు మన్నించాలని యాపిల్ సంస్థ కోరింది. ఈ లోపాన్ని సరిచేస్తామని భరోసా ఇచ్చింది.

  • Loading...

More Telugu News