: ఈ మాజీ హోం మంత్రి వద్ద రూ.2000 కూడా లేవట!


చత్తీస్ గఢ్ మాజీ హోం మంత్రి నాన్కీ రామ్ కన్వర్ తన వద్ద కనీసం రూ.2000 కూడా లేవంటున్నారు. విషయం ఏమిటంటే... సదరు మాజీ అమాత్యులు 2013లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయినా గానీ, రాయ్ పూర్లోని ప్రభుత్వ బంగ్లాను వీడేందుకు నిరాకరిస్తున్నారు. దీనిపై, అధికారులు ఎన్నో నోటీసులు పంపారు. బంగ్లాను ఖాళీ చేయాలని, దాంతోపాటు రూ.2,40,000 బిల్లు కట్టాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనికి నాన్కీ రామ్ స్పందిస్తూ, "నా వద్ద కనీసం రూ.2000 కూడా లేవు, మరి, రూ.2,00,000 ఎలా చెల్లించగలను..? నా స్థలాన్ని అమ్మితేగానీ ఆ బిల్లు కట్టలేను" అని తెలిపారు. అంతేగాకుండా, ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ కు ఓ ఉత్తరం కూడా రాశారు ఈ మాజీ మంత్రి. బిల్లును మాఫీ చేయాలని అందులో కోరారు.

  • Loading...

More Telugu News