: సీఎం జయలలిత పిటిషన్ తిరస్కరణ


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో తిరస్కరణకు గురయింది. ఈ కేసులో రేపు (శనివారం) బెంగళూరు కోర్టు తుది తీర్పు వెల్లడించనుండగా, ఆ తీర్పును వాయిదా వేయాలని కోరుతూ ఆమె సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో జయకు నిరాశే మిగిలింది. రూ.66 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించి 1996లో డీఎంకే దాఖలు చేసిన ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది.

  • Loading...

More Telugu News