: బీజేపీ మహారాష్ట్ర శత్రువు: శివసేన


బీజేపీతో ఇరవై ఐదేళ్ల మిత్రబంధాన్ని తెంచుకున్న శివసేన పార్టీ తన పత్రిక 'సామ్నా'లో కాషాయదళంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీజేపీతో తమ కూటమిని కాపాడుకునేందుకు తమ వంతు ప్రయత్నించామని పేర్కొంది. "మహారాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ఆడుకున్న బీజేపీతో మా పొత్తును రక్షించుకునేందుకు ప్రయత్నం చేశాం. ఇది నిజంగా సమైక్య మహారాష్ట్ర ఉద్యమ అమరులకు అవమానం. అందుకే వారు మహారాష్ట్రకు శత్రువు" అని పత్రిక సంపాదకీయంలో మండిపడింది. హిందుత్వ భావజాలానికి కట్టుబడి ఉన్న రెండు పార్టీలు విడిపోవడం నిజంగా దురదృష్టమని శివసేన తెలిపింది. కాగా, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు ఒక్కరోజే సమయం ఉండటంతో నేరుగా పత్రాలు నింపేసి నామినేషన్ వేయమని అభ్యర్థులకు చెప్పింది. కానీ, అభ్యర్థుల జాబితాను మాత్రం శివసేన బహిరంగంగా వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News