: ఆసియా క్రీడల్లో ముగిసిన సైనా పోరాటం
ఆసియా క్రీడల్లో భారత్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి పాలయింది. పతకంతో తిరిగి వస్తుందనుకున్న సైనా క్వార్టర్స్ లోనే ఇంటి దారి పట్టింది. చైనాకు చెందిన వాంగ్ చేతిలో 21-8, 9-21, 7-21తో ఓడిపోయింది. మొదటి గేమ్ లో సత్తా చాటినప్పటికీ రెండు, మూడు గేముల్లో వాంగ్ ముందు సైనా నిలవలేకపోయింది.