: రవిశాస్త్రి కాంట్రాక్టు పొడిగిస్తారా?


ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు రవిశాస్త్రిని కోచింగ్ డైరక్టర్ గా నియమించడం తెలిసిందే. ఇప్పుడా పర్యటన ముగిసింది. కుక్ సేనతో టెస్టు సిరీస్ పరాజయం నేపథ్యంలో, వన్డే సిరీస్ లో మెరుగైన ఫలితాల కోసం శాస్త్రి నియామకం జరిగింది. ఆ సిరీస్ లో ధోనీ సేన ఘనవిజయం సాధించింది. దాంతో, శాస్త్రి వరల్డ్ కప్ వరకూ ఉంటాడని భారత క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీనిపై బీసీసీఐ ఇప్పటివరకూ పెదవి విప్పలేదు. శుక్రవారం చెన్నైలో బోర్డు వార్షిక సర్వ సభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో రవిశాస్త్రి కాంట్రాక్టును పునరుద్ధరించే అంశాన్ని వర్కింగ్ కమిటీ ప్రధానంగా చర్చించనుంది. అటు, వచ్చేె నెలలో విండీస్ తో జరిగే వన్డే సిరీస్ కు రవిశాస్త్రి టీమిండియాతో కలిసి పనిచేస్తాడా? లేదా? అన్న విషయంలోనూ స్పష్టత లేదు. కాగా, నేటి సమావేశంలో, కోచ్ డంకన్ ఫ్లెచర్ కొనసాగింపు అంశంపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News